గుంటూరు : ఓ మెడికల్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో నిందితులైన ఐదుగురికి శుక్రవారం నాలుగవ అదనపు జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్నారై మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని పెద్దప్రోలు శ్వేతను.. ఆమె డ్రైవర్ తిమ్మిబోయిన ప్రసాద్, మరో నలుగురు వ్యక్తులతో కలిసి జూన్8, 2012న కిడ్నాప్ చేశాడు. ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఆమెను దాచిపెట్టి తండ్రిని రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. వెంటనే ఆ విషయాన్ని ఆయన పోలీసులకు తెలియజేశారు.
అప్రమత్తమైన పోలీసులు అదే రోజు దుండగుల చెర నుంచి చాకచక్యంగా శ్వేతను కాపాడారు. కాగా ఈ కిడ్నాప్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. మూడేళ్ల విచారణ అనంతరం గన్నవరానికి చెందిన తిమ్మిబోయిన ప్రసాద్, ఉయ్యూరు హాలీ, పరిమి నాగరాజు, రాణిమేకల వెంకన్న, కంకిపాడుకు చెందిన మందా రవిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇందులో మందా రవి ఇంకా పరారీలోనే ఉన్నాడు.
కిడ్నాప్ కేసులో ఐదుగురికి జీవితఖైదు
Published Fri, Jul 31 2015 3:46 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement