
పోలవరంపై కేసీఆర్ అభ్యంతరాలు వాస్తవమే
కర్నూలు : పోలవరం ప్రాజెక్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలు వాస్తవమేనని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి నేత రామకృష్ణ అన్నారు. తాము పోలవరాన్ని వద్దనటం లేదని, అయితే ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలన్నది తమ డిమాండ్ అని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సత్వర న్యాయం జరిపించాలని, భూమి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని రామకృష్ణ కోరారు. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని, లేకుంటే ఆగస్ట్ 15 వేడులకను అడ్డుకుంటామని రామకృష్ణ తెలిపారు. రైతు, డ్వాక్రా రుణాలపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.