'గౌతమిపుత్ర శాతకర్ణి' వేడుకల్లో అపశ్రుతి
నెల్లూరు: జిల్లాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అర్ధశత దినోత్సవ వేడుకల్లో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. నర్త థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. దీంతో థియేటర్‌కు సమీపంలో ఉన్న ఆయిల్ గోడౌన్, ఆటో మొబైల్స్ షాపులపై బాణసంచా నిప్పురవ్వలు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
హుటాహుటిన ఘటనాస్ధలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆయిల్ గోడౌన్, ఆటో మొబైల్స్‌లలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.