'క్యుములోనింబస్ మేఘాలే కారణం'
విశాఖపట్నం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, విజయనగరం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. క్యుములో నింబస్ మేఘాలే కారణమని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం, సీతానగరం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాల వర్షం కారణంగా వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. తగరపువలసలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది.