జామి: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నవిశాఖ ఎక్స్ప్రెస్ విజయనగరం జిల్లా కలమండ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్లో లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు రైలును తనిఖీ చేసి లోపాన్ని గుర్తించారు. వెంటనే రైలుకు మరమ్మత్తులు చేపట్టారు. అనంతరం 11 గంటల సమయంలో రైలు బయలుదేరింది. రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.