వర్ష బాధితులను ఆదుకుంటాం..
Published Sun, Nov 24 2013 2:14 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: గత నెల, రెండు రోజులగానూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం ఆయన ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్, వివిధ శాఖల అధికారులతో బాధితులకు అందించిన సాయంపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3,330 ఇళ్లు దెబ్బతినగా, రూ.91.29 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి వంట సామగ్రికి రూ.2,500, దుస్తుల కొనుగోలుకు రూ.2,500 అందించినట్లు చెప్పారు. హెలెన్ కారణంగా జిల్లాలో 10 వేల హెక్టార్లలో వరి దెబ్బతిందని తెలిపారు. నాలుగు మండలాల్లో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండువేల మందిని తరలించినట్లు చెప్పారు.
రాష్ట్ర విభజనపై పునరాలోచించాలి..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం పునరాలోచించాలని మంత్రి కాసు కోరారు. రా్రష్ట విభజన వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేసే ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని తెలిపారు. రాష్ర్ట సమైక్యతకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం మారతారని ఇటీవల వచ్చిన ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు.
Advertisement
Advertisement