పెద్దదోర్నాల న్యూస్‌లైన్: బ్యాంకు అధికారి కులం పేరుతో దూషిస్తున్నారంటూ మండలానికి చెందిన దళితులు స్థానిక స్టేట్‌బ్యాంకు కార్యాలయం వద్దనున్న రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ నేత సింగా చిన్నబూషి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంజూరు చేసే రుణాల కోసం స్థానిక స్టేట్ బ్యాంకు శాఖ ఫీల్డ్ ఆఫీసర్‌ను బొమ్మలాపురానికి చెందిన కొప్పుల డానియేల్ అనే వ్యక్తి కలిశాడని చెప్పారు. అయితే సదరు అధికారి కులం పేరు ప్రస్తావించి.. ‘మీకు రుణాలిస్తే కట్టరు. అలాంటి వారికి ఎందుకు ఇవ్వాలి’ అని దూషించారని తెలిపారు.
రుణాలపై బ్యాంకు మేనేజర్‌ను కలుస్తుంటే.. ఫీల్డ్ ఆఫీసర్ జోక్యం చేసుకుంటూ రుణాలు చెల్లించరని అడ్డుపడుతున్నారని చెప్పారు. పంచాయతీ సర్పంచ్ తత్తూరి మరియమ్మ ఆందోళన కార్యక్రమానికి మద్దతు పలికారు. రాస్తారోకో దెబ్బకు కర్నూలు -గుంటూరు ప్రధాన ర హదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో దళితులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జెడ్ చిన్నరామయ్య, యేసుదానం, బీ పీటర్, పీ విల్సన్, సింగా కోటేశ్వరరావు, పీ వెంకటయ్య, నాగరాజు, పీ ఎర్రయ్య, ఓ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. దీనిపై స్టేట్‌బ్యాంకు మేనేజర్ రంగారావు, ఫీల్డ్ ఆఫీసర్లను వివరణ కోరగా ఇటీవలే ఇంటి గ్రేటెడ్ యాక్షన్‌ప్లాన్ కింద గ్రామసభ నర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారని తెలిపారు. జాబితా ప్రకారం పూర్తి స్థాయిలో విచారించి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఎవరినీ కులం పేరుతో దూషించడం కానీ, కించపరచడం కానీ చేయలేదన్నారు.
దళితుల రాస్తారోకో
Published Thu, Dec 12 2013 5:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement