రాజంపేట: తమ భూములు సర్వేచేయడం లేదంటూ రాజంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురవారం దళితులు ధర్నా చేపట్టారు. అగ్రవర్ణాలకు చెందిన వారి భూములు సర్వే చేస్తూ తమ భూములు సర్వే చేయకపోవడం అన్యాయం అంటూ రాజంపేట పరిధిలోని ఆర్కేపాడు, ఆకేపాడు, లింగం హరిజనవాడ, కట్టకిందపల్లి గ్రామాలకు చెందిన దళితులు ఆందోళన చేశారు. ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో మరో అధికారికి ఈ విషయం గురించి దళితులు వినతి పత్రం సమర్పించారు.