రియల్ ఎస్టేట్, వడ్డీవ్యాపారంలో వందలమందిని మోసం చేసిన నార్ల వంశీ కృష్ణ ఎట్టకేలకు మంగళవారం పోలీసులకు చిక్కాడు.
సాక్షి,విజయవాడ: రియల్ ఎస్టేట్, వడ్డీవ్యాపారంలో వందలమందిని మోసం చేసిన నార్ల వంశీ కృష్ణ ఎట్టకేలకు మంగళవారం పోలీసులకు చిక్కాడు. జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన ఈయన రియల్డర్‌గా అవతారం మార్చి మోసాలకు పాల్పడ్డాడు. పోలీసులు,పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. బాధితుల నుంచి వత్తిడి రావడంతో రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో చనిపోయినట్లు హైడ్రామా సృష్టించి అదృశ్యమయ్యాడు. నార్ల వంశీకృష్ణ మాయమయ్యాక విజయవాడలోని సత్యనారాయణపురం, మాచవరం, వన్‌టౌన్, పటమటలలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా, వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గత రెండేళ్లుగా వంశీకృష్ణ ఇతర రాష్ట్రాలతో పాటు సింగపూర్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.