సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్)కు హైకోర్టులో ఊరట లభించింది. డీసీహెచ్‌ఎల్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్‌టన్ ఫ్రయిటర్స్ ఓ విమానాన్ని కుదువపెట్టి తీసుకున్న బ్యాంకు రుణంపై విమాన విలువకు సమాన పూచీకత్తు చెల్లించకపోతే ఎయిర్‌క్రాఫ్ట్‌ను వేలం వేయాల్సి ఉంటుందంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
విచారణను వాయిదా వేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి డీసీహెచ్‌ఎల్ రూ.500 కోట్లు రుణం తీసుకుంది. అలాగే డీసీహెచ్‌ఎల్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్‌టన్ ఫ్రయిటర్స్ తన హాకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కుదువపెట్టి 2007లో రూ.10 కోట్లు రుణం తీసుకుంది. రుణ చెల్లింపుల్లో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్‌కు సమానమైన మొత్తానికి పూచీకత్తును సమర్పించకపోతే ఎయిర్‌క్రాఫ్ట్‌ను అమ్మేయాల్సి వస్తుం దని డీఆర్‌టీ ఈ నెల 1న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
‘డెక్కన్ క్రానికల్’కు హైకోర్టులో ఊరట
Published Sat, Jan 18 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement