చిట్టేపల్లి(పొదలకూరు), న్యూస్‌లైన్ : అదనపు క ట్నం కోసం వేధిస్తున్నారని ఓ సాప్ట్‌వేర్ ఇంజనీరు వీరేపల్లి స్వాదిప్రసూన మూడు రోజులుగా భర్త ఇంటి ఎదుట నిరసన దీక్ష చే స్తోంది. మంగళవారం రాత్రి ఆలస్యంగా అందిన సమాచారం మేరకు.. ఆత్మకూరుకు చెందిన చంద్రశేఖరం, సుభాషిణి కుమార్తె ప్రసూన కు గతేడాది జనవరి 26న మండలంలోని చిట్టేపల్లికి చెందిన వర్ధినేని వెంకటేశ్వర్లుతో వైభవంగా వివాహం జరిపించారు. కట్నం కింద 30 సవర్ల బంగారం, రెండెకరాల పొలం, ఆత్మకూరులో రెండు పోర్షన్ల ఇల్లు, కొంత నగదు అందజేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగ ని మిత్తం వెళ్లి కాపురం పెట్టేందుకు గృహోపకరణ వస్తువులు కూడా ఇచ్చారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగినా.. ఆ తర్వాత అదనంగా మరో రూ.12 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా భర్త, ఆయన అక్కా, బావలు గొర్ల పెంచలమ్మ, రామానాయుడు నుంచి స్వాదిప్రసూనకు వేధింపులు మొదల య్యాయి. దీంతో ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, పోలీసుల హెచ్చరికతో రెండు నెలలు బాగా చూసుకున్నారు.
తిరిగి వేధింపులకు పాల్పడటంతో పుట్టింటికి వచ్చిన బాధితురాలు తన భర్త తనకు కావాలని చిట్టేపల్లిలోని అత్తింటి వద్ద షామియానా వేసుకుని నిరసన దీక్షకు దిగారు. వీరి వేధింపుల వల్ల ఐదు నెలల గర్భం కూడా పోయిందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ గూగుల్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తుండగా ఆ ఉద్యోగాన్ని మాన్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి వద్ద నుంచి నిష్ర్కమించేది లేదని భీష్మించుకుంది. ప్రసూన దీక్ష చేయడంతో ఆమె భర్త, అక్కా, బావ ఇంట్లో లేకుండా వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పొదలకూరు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
కట్నం కోసం వేధిస్తున్నారు..
Published Wed, Oct 9 2013 4:38 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement