కరోనాపై ఔషధ నియంత్రణ శాఖ రూపొందించిన యూట్యూబ్ వీడియో
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కరోనా మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా జీవించాలో వివరిస్తూ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ పాటల రూపంలో యూట్యూబ్ లో వీడియో, కవితా సంపుటాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణ చర్యలను వివరిస్తూ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు విజయశేఖర్ స్వీయ రచనలో దీనిని రూపొందించారు. (రెడ్ జోన్‌లో మినహాయింపులకు నో..)
వైరస్ ఎక్కడి పుట్టింది, దీని ప్రభావంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పొందుపరుస్తూ ఆరు నిమిషాల పాటు ఈ వీడియో రూపొందించారు. ఔషధ నియంత్రణ శాఖలో పని చేస్తున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఉద్యోగులే మొత్తం దీని రూపకల్పనకు సహాయ సహకారాలు అందించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేళ ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలపై ఏడీ విజయశేఖర్ హిందీ కవితా సంపుటి రచించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. (పాక్, రష్యాల్లో కరోనా విజృంభణ)
Comments
Please login to add a commentAdd a comment