బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉంది.
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది క్రమంగా వాయువ్యదిశగా కదులుతోంది. మళ్లీ ఉత్తరాంధ్రపైనే దీని ప్రభావం వుండవచ్చని తెలుస్తోంది. విశాఖకు ఆగ్నేయంగా 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైవున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు ఉయదం తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఈ నెల 9 నాటికి వాయుగుండం కాస్త అల్పపీనంగా మరవచ్చు అన్ని వాతావరణశాఖ తెలిపింది. 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిచారు. అన్ని ప్రధాన ఓడరేవులలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.