
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో మద్యం షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించామని.. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయన్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్ షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇకపై ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించారు.
అవినీతి లేని పాలన అందించటమే ధ్యేయంగా వైఎస్ జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ నవరత్నాలు అమలు చేస్తున్నారని చెప్పారు. (చదవండి: అమల్లోకి కొత్త మద్యం పాలసీ)