కోరిక తీర్చలేదని యువతిపై బ్లేడ్‌తో దాడి | Desire Young woman can not afford to Attack on the blade | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని యువతిపై బ్లేడ్‌తో దాడి

Published Tue, Jan 20 2015 4:15 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM

Desire Young woman can not afford to Attack on the blade

మార్కాపురం : తన కోరిక తీర్చలేదని యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై రాంబాబు కథనం ప్రకారం.. బాపూజీ కాలనీలో టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తున్న 18 ఏళ్ల యువతిపై అదే కాలనీకి చెందిన రాడ్ బెండింగ్ వర్కర్ ఏసుపాదం తరచూ వేధిస్తున్నాడు. సోమవారం కిరాణాషాపునకు వెళ్తున్న యువతి వెంటపడి తనతో రావాలని కోరాడు. నిరాకరించిన యువతి చేతిపై బ్లేడ్‌తో గాయపరిచాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement