యువతి కిడ్నాప్‌నకు యత్నం | Girl safely Escapes from Kidnapper in peddapally | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో పరిచయం, బ్లాక్ మెయిల్

Published Sat, Oct 22 2016 8:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

యువతి కిడ్నాప్‌నకు యత్నం - Sakshi

యువతి కిడ్నాప్‌నకు యత్నం

- బైక్‌పై వెళ్తుండగా దూకి  తప్పించుకున్న వైనం  
- చికిత్స తర్వాత అదృశ్యం
 
 పెద్దపల్లి: ఓ యువతికి ఓ యువకుడు ఫోన్‌లో పరిచయమయ్యాడు. ఫోన్‌లో నాలుగు రోజులుగా మాట్లాడుకుంటున్నారు. చివరకు ఆ యువకుడు ‘నువ్వు నాతో మాట్లాడుతున్నావని, మీ ఊరిలో ఈ విషయం అందరికి చెబుతానని’ బ్లాక్‌మెయిల్ చేసి యువతిని పెద్దపల్లికి రమ్మన్నాడు. ఆమె రావడంతో బైక్ ఎక్కించుకున్నాడు. వారిని మరో ఇద్దరు యువకులు వెంబడిస్తుండడం చూసి ఆ యువతి బైక్‌పై నుంచి దూకేసిన సంఘటన పెద్దపల్లిలో శుక్రవారం జరిగింది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన 18 ఏళ్ల యువతికి పెద్దపల్లికి చెందిన సాయికుమార్ ఫోన్‌లో నాలుగురోజుల క్రితం పరిచయమయ్యాడు.

నిత్యం ఫోన్‌లో సంభాషిస్తున్నారు. శుక్రవారం ఉదయం సాయికుమార్ మరోసారి యువతికి ఫోన్ చేసి పెద్దపల్లికి రమ్మని చెప్పాడు. లేదంటే తనతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు చేశానని, మీ ఊరిలో ప్రచారం చేస్తానని బెదిరించాడు. భయపడిన సదరు యువతి అక్క కొడుకుతో పెద్దపల్లికి వచ్చింది. అతణ్ని బస్టాండ్ వద్ద ఉంచి సాయికుమార్ బైక్ ఎక్కింది. బైక్ పై శాంతినగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తున్న క్రమంలో సాయికుమార్ మరో ఇద్దరు యువకులకు ఫోన్ చేసి రమ్మన్నాడు.

వారు వెంటాడుతున్న విషయాన్ని గమనించిన యువతి బైక్‌పై నుంచి దూకేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా, యువకుడు పరారయ్యాడు. యువతి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకొని వెళ్లిపోయింది. తనకు సమాచారం తెలియగానే ఆస్పత్రికి కానిస్టేబుల్‌ను పంపించానని, ఆస్పత్రిలో ఎవరూ లేరని, ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement