సాక్షి కథనంపై కదిలిన యంత్రాంగం
సాక్షి, అమరావతి: జాతీయ ఖోఖో పోటీలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మర్చిపోయిన ఇద్దరు అధికారులపై వేటుపడింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏస్జీఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా కార్యదర్శిలను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ జి.శ్రీనివాసులు బాధ్యులను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ ఖోఖో పోటీలకు రాష్ట్రంనుంచి 24 మంది విద్యార్థులను మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు పంపి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఆ విద్యార్థులు పోటీలకు అవకాశం కోల్పోవడం, దేవాస్‌లో ఇబ్బందులకు గురైన వైనంపై ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే.
‘దేవాస్’ ఘటనపై ఇద్దరు సస్పెన్షన్
Published Sat, Dec 17 2016 2:24 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM
Advertisement
Advertisement