ఖానాపూర్, న్యూస్‌లైన్: ఖానాపూర్ మండలం పెంబి అటవీ రేంజ్ పరిధిలోని రాగిదుబ్బనాలలో కలప స్మగ్లర్లు అట వీ సిబ్బందిపై దాడి చేశారు. స్మగ్లర్ల దాడిలో రేంజ్ అధికారి శంకర్‌తోపాటు మరో ఇద్దరికి గాయాల య్యాయి. పోలీసులు ఒక్క రౌండ్ కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటన స్థలం లో ఆరు ఎడ్లబండ్లు, 22 టేకు దుంగలను స్వాధీ నం చేసుకున్నారు.
ఎఫ్‌ఆర్‌వో కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం పెంబిలో అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి రెండు గంటలకు ఎస్సై నజీర్, పోలీసు బృందంతోపాటు కడెం, ఖానాపూర్, పెంబి రేంజ్‌ల అటవీ అధికారులతో పెంబి అటవీ ప్రాంతంలోని రాగిడుబ్బనాల, ఇచ్చోడ మండలం నారాయణగూడకు వెళ్లాం. తమ రాకను గమనించిన స్మగ్లర్లు బండలు, గొడ్డళ్లతో దాడికి యత్నించారు. ఎదురుదాడికి దిగడంతో సిబ్బంది రవి, రాజేశ్వర్‌లకు గాయ్యాయి. విషయం గమనించిన ఎస్సై నజీర్ పలుసార్లు స్మగ్లర్లను హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో ఒక్క రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు కలప దుంగలు, ఎండ్లబండ్లను వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఇచ్చోడ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు శంకర్ తెలిపారు.
స్మగ్లర్ల బీభత్సం
Published Sat, Jan 18 2014 4:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement