timber smugglers
-
ఫారెస్ట్ అధికారిపై కలప స్మగ్లర్ల దాడి
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారిపై స్మగ్లర్లు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు మర్లపల్లి బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వరస్తున్న చంద్రశేఖర్ రెడ్డికి కలప అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆయన స్మగ్లర్ల కారును వెంబడించారు. ఈ క్రమంలోనే కలప దొంగలు ఆఫీసర్ వెళ్తున్న బైకును కారుతో డీకొట్టారు. చంద్రశేఖర్ కు తీవ్రగాయాలై సృహ కోల్పోడంతో స్మగ్లర్లు పరారైయ్యారు. స్థానికుల సహకారంతో చంద్రశేఖర్ ను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
కలప తరలిపోతోంది..
* ప్రేక్షక పాత్రలో అధికారులు * మొబైల్ పార్టీ నిఘాతో పట్టివేత జన్నారం : కలప స్మగ్లర్ల కన్ను కవ్వాల్ అభయారణ్యంలోని టేకు చెట్లపై పడింది. ఈ ప్రాంతంలో లభించే టేకుకు భారీ డిమాండ్ ఉండడంతో వృక్షాలపై వేటు వేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యంలోని పలు ప్రాంతాల నుంచి విలువైన టేకును తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాళ్లపేట్ రేంజ్లో నిత్యం కలప తరలిపోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి రంగంలోకి దిగి మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ద్వారా కలప స్వాధీనం చేసుకున్న సంఘటనలే అందుకు నిదర్శనం. ఉన్నతాధికారులు కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతుండగా.. కొందరు కింది స్థాయి అధికారుల సహకారంతో కలప అక్రమ రవాణా సాగిపోతోంది. డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో కూడా ఇటీవల స్మగ్లింగ్ పెరిగింది. రేంజ్ పరిధిలోని కల్లెడ, ఇందన్పల్లి బీట్ల పరిధిలో ఇటీవల పట్టుబడిన సంఘటనలు చూస్తే స్మగ్లర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కల్లెడ బీట్‌లోని ఎర్రగుంటలో 20 రోజుల క్రితం రెండు ఎడ్లబండ్లు పట్టుకోగా.. గొడవకు దారి తీసి పోలీసు కేసు వరకు వెళ్లింది. ఇటీవల రూ.25వేలు విలువైన పది టేకు దుంగలు పట్టుకున్నారు. ఇందన్పల్లి రేంజ్‌లోని పలు ప్రాంతాల్లో టేకు చెట్లను నరికి వేసి దుంగలను అమ్ముకుంటున్నారు. టేకు విలువ పెరగడంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ఉన్నతాధికారి తన సొంతానికి టేకు కలపతో ఫర్నిచర్ చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పది రోజుల క్రితం రెండు టేకు దుంగలను సదరు అధికారి కింది స్థాయి అధికారులతో తెప్పించి ఫర్నిచర్ కోసం కోతకు ఇచ్చినట్లు తెలిసింది. కలప స్మగ్లింగ్ అరికట్టాల్సిన అధికారే ఇలాంటి పనిచేయడం చర్చనీయాంశంగా మారింది. కంచె చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తే కలప అక్రమ రవాణాకు ఎలా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కలప స్మగ్లింగ్‌ను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. స్మగ్లింగ్ తగ్గింది.. గతంతో పోలిస్తే ఇందన్పల్లి అడవుల్లో కలప స్మగ్లింగ్ తగ్గింది. ఒకట్రెండు సంఘటన తప్పా కలప రవాణా లేదు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశాం. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నాం. స్మగ్లింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నాం. - ప్రతాప్‌రెడ్డి, ఇందన్పల్లి రేంజ్ అధికారి -
అంతరిస్తున్న అటవీ సంపద
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్: కలప వ్యాపారుల స్వార్థానికి పచ్చని చెట్లు బలవుతున్నాయి. కలప స్మగ్లర్లు చెట్ల ను యథేచ్ఛగా నరికివేయడంతో రోజురోజు కూ అటవీ సంపద అంతరించి పోతోంది. పెద్ద పెద్ద వృక్షాలు సైతం కనుమరుగవుతున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అయినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరి స్తున్నారు. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో చేతు లు కలిపి కలప స్మగ్లర్లు టేకు, జిట్రేగి, వేప, తుమ్మ వంటి చెట్లను విచ్చలవిడిగా నరికి ప్రతి నిత్యం నగరానికి చేరవేస్తున్నారు. ‘దొరికితే దొంగలు లేకపోతే దొరలు’ అన్నట్టుగా మారింది పరిస్థితి. అటవీ శాఖ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి కలపను పట్టుకున్నా, స్మగ్లర్లు మాత్రం పారి పోవడం పరిపాటుగా మారింది. పలుమార్లు రిక్షాలు,సైకిళ్లు, ఆటో లు, లారీలు అక్రమ కలపతో పట్టుబడ్డాయి. విచిత్రం గా నిందితులు మాత్రం దొరకలేదు. నగరంలో చా లా చోట్ల అక్రమంగా నిలువ ఉంచిన టేకు దుంగలు, కలప సైజులు దొరికాయి. అయినా అటవీ చట్టం కిం ద నమోదైన కేసులు మాత్రం నామమాత్రమే. అటవీ సంపదను దోచుకుంటున్న స్మగ్లర్లు అక్రమంగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని ముజాహిద్నగర్లో ఓపాత ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన రూ. 80 వేల విలువ చేసే 22 టేకు దుంగలను పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటనలు చేశారు. కర్ర ఎవరిది, ఇల్లు ఎవరిదనే అంశాలను మాత్రం విస్మరించారు. గత డిసెంబరులో బోమ్మన్నాగు ప్రాంతంలో 190 అక్రమ టేకు నిల్వలను ఫ్లయింగ్స్క్వడ్ అధికారులు పట్టుకున్నారు. గోదాము ఎవరిదో తేలినా, యజమానిపై కేసు మాత్రం నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సరిహద్దులోని యంచ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా డీసీఎం వ్యానులో తరలిస్తున్న 5 లక్షల విలువ చేసే 90 టేకు దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. {పతి నిత్యం నగరానికి కాల్పోల్ గ్రామం వైపు నుంచి రిక్షాలలో, ఆటోలలో వస్తుంది. క్షేత్రస్థాయి సిబ్బంది అనుగ్రహం లేనిదే ఈ దందా నడవదనే ఆరోపణలు ఉన్నా యి. బడాపహాడ్, లక్ష్మాపూర్ శివారు నుంచి టేకు సైజులు నగరంలోని బబస్సాహెబ్ పహాడ్, ధర్మపురి హిల్స్, మాలపల్లి, ముజాహిద్‌నగర్‌కు వస్తున్నట్లు సమాచారం. మల్కాపుర్, మల్లారం అటవీ ప్రాంతం నుంచి కూడా అక్రమ కలప నగరానికి చేరుతుందని సమాచారం. నిఘా పటిష్టంగా ఉందని సంబంధిత శాఖ అధికారులు చె బుతున్నా, స్మగ్లర్లు మాత్రం దర్జాగా కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మల్లారం గండి అటవీ ప్రాంతం నుంచి రోజూ తెల్లవారు జామున సైకిళ్లపై చాలా మంది వంట చెఱుకు, టేకుసైజులు తెస్తుంటారు. 2014 మార్చి ఒకటవ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ముదక్పల్లి, మల్లారం, నవీపేట సెక్షన్ మంచిప్ప ప్రాంతాలలో నాగారం, పూలాంగ్ తదితర ప్రాంతాలలో నాలుగు 4 లక్షల రూపాయల విలువ చేసే టేకు దుంగలను పట్టుకున్నారు. 13 కేసులను నమోదు చేశారు. 23 నాన్‌టేకు కేసులు నమోదు చేసి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాపైనే అధారపడి జీవిస్తున్న కుటుంబాలు నగరంలో వందల సంఖ్యలో ఉన్నాయంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటవీదొంగల చేతులలో అడవి క్రమంగా కనుమరుగవుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. -
బడాబాబుల సంగతేమిటో
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్: పొట్టకూటి కోసం చెట్లు నరుకుతున్న వారిపై ప్రతాపం చూపుతున్న అటవీ శాఖాధికారులు కలప స్మగ్లింగ్‌తో కోట్లు గడిస్తున్నవారిపై మాత్రం కనిక రం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడాబాబులను వదిలేసి బడుగుజీవులకు జరిమానాలు విధించి తమ టార్గెట్లు నింపుకుంటున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో ఉన్న కొద్దిపాటి అటవీ సంపద రోజు రోజుకూ అంతరించిపోతోంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో బాన్సువాడ, నిజామాబాద్, కమ్మర్పల్లి రేంజ్‌లున్నాయి. సుమారు 12వేల హెక్టార్ల అటవీ సంపద ఉండేది. అది రాను రాను ఐస్‌ముక్క లా కరిగిపోతోంది. పలువురు స్మగ్లర్లు కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికిస్తున్నారు. వాటిని రాత్రి వేళల్లో వాహనాలలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని తరలించేందుకు ఐదుగురిని నియమించి వారికి రూ. 10 వేల వరకు ఇచ్చి టాటాసుమో, స్కార్పీయో వాహనాలలో కోరిన చోటకు పంపిస్తున్నారని సమాచారం. ప్రధానంగా బాన్సువాడ రేంజ్‌లోని బడాపహాడ్, లకా్ష్మపూర్, జలాల్పూర్, అటవీ ప్రాంతాల నుంచి విలువైన టేకు దుంగలను తరలిస్తున్నారు. వీటిని నగరంలోని రహస్య ప్రదేశాలలో నిలువ ఉంచి అవసరం ఉన్న వారికి అక్కడి నుంచి చేరవేస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ మండలంలోని మంచిప్ప, కులాస్పూర్, బాడ్సీ, మోపాల్, మల్లారం ప్రాంతాల నుంచి కూడా ప్రతి రోజు వివిధ వాహనాలలో, సైకిళ్లపై, ఆటోల్లో వీటిని నగరానికి చేరవేస్తారు. ఇలా చేర వేసిన వాటిని వంటచెరుకుగా నగరంలోని వివిధ వారికి విక్రయిస్తారు. పట్టించుకోని అధికారులు తమ కళ్ల ఎదుటే ఉన్న అడవి సంపద తరలి పోతున్నా సంబంధిత అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. పెట్రోలింగ్ చేసే సమయంలో వారి కంటికి కనిపించిన వారినే నామ మాత్రంగా జరిమానాలు విధుస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించి చెట్లను నరకకుండా పర్యవేక్షించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టుకున్న కలప వివరాలు ఇలా ఉన్నాయి 2013 జనవరి నుంచి 2014 జనవరి వరకు అధికారులు పట్టుకున్న కలప విలువ సుమారు రూ. 22 లక్షలుంటుంది. ప్రతి నెల 20న నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో వీటిని వేలం వేస్తారు. ఇందులో నుంచి సుమారు రూ. 12 లక్షల విలువ చేసే కలపను విక్రయించి ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. -
స్మగ్లర్ల బీభత్సం
ఖానాపూర్, న్యూస్‌లైన్: ఖానాపూర్ మండలం పెంబి అటవీ రేంజ్ పరిధిలోని రాగిదుబ్బనాలలో కలప స్మగ్లర్లు అట వీ సిబ్బందిపై దాడి చేశారు. స్మగ్లర్ల దాడిలో రేంజ్ అధికారి శంకర్‌తోపాటు మరో ఇద్దరికి గాయాల య్యాయి. పోలీసులు ఒక్క రౌండ్ కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటన స్థలం లో ఆరు ఎడ్లబండ్లు, 22 టేకు దుంగలను స్వాధీ నం చేసుకున్నారు. ఎఫ్ఆర్వో కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం పెంబిలో అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి రెండు గంటలకు ఎస్సై నజీర్, పోలీసు బృందంతోపాటు కడెం, ఖానాపూర్, పెంబి రేంజ్‌ల అటవీ అధికారులతో పెంబి అటవీ ప్రాంతంలోని రాగిడుబ్బనాల, ఇచ్చోడ మండలం నారాయణగూడకు వెళ్లాం. తమ రాకను గమనించిన స్మగ్లర్లు బండలు, గొడ్డళ్లతో దాడికి యత్నించారు. ఎదురుదాడికి దిగడంతో సిబ్బంది రవి, రాజేశ్వర్లకు గాయ్యాయి. విషయం గమనించిన ఎస్సై నజీర్ పలుసార్లు స్మగ్లర్లను హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో ఒక్క రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు కలప దుంగలు, ఎండ్లబండ్లను వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఇచ్చోడ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు శంకర్ తెలిపారు.