ఫారెస్ట్ అధికారిపై కలప స్మగ్లర్ల దాడి | tinber smugglers attacked on forest officer | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్ అధికారిపై కలప స్మగ్లర్ల దాడి

Published Wed, Jul 8 2015 1:04 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

tinber smugglers attacked on forest officer

బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారిపై స్మగ్లర్లు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు మర్లపల్లి బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వరస్తున్న చంద్రశేఖర్ రెడ్డికి కలప అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆయన స్మగ్లర్ల కారును వెంబడించారు. ఈ క్రమంలోనే కలప దొంగలు ఆఫీసర్ వెళ్తున్న బైకును కారుతో డీకొట్టారు. చంద్రశేఖర్ కు తీవ్రగాయాలై సృహ కోల్పోడంతో స్మగ్లర్లు పరారైయ్యారు. స్థానికుల సహకారంతో చంద్రశేఖర్ ను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement