వినాయక్‌నగర్, న్యూస్‌లైన్: పొట్టకూటి కోసం చెట్లు నరుకుతున్న వారిపై ప్రతాపం చూపుతున్న అటవీ శాఖాధికారులు కలప స్మగ్లింగ్‌తో కోట్లు గడిస్తున్నవారిపై మాత్రం కనిక రం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడాబాబులను వదిలేసి బడుగుజీవులకు జరిమానాలు విధించి తమ టార్గెట్లు నింపుకుంటున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో జిల్లాలో ఉన్న కొద్దిపాటి అటవీ సంపద రోజు రోజుకూ అంతరించిపోతోంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో బాన్సువాడ, నిజామాబాద్, కమ్మర్‌పల్లి రేంజ్‌లున్నాయి. సుమారు 12వేల హెక్టార్ల అటవీ సంపద ఉండేది. అది రాను రాను ఐస్‌ముక్క లా కరిగిపోతోంది. పలువురు స్మగ్లర్లు కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికిస్తున్నారు. వాటిని రాత్రి వేళల్లో వాహనాలలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
వీటిని తరలించేందుకు ఐదుగురిని నియమించి వారికి రూ. 10 వేల వరకు ఇచ్చి టాటాసుమో, స్కార్పీయో వాహనాలలో కోరిన చోటకు పంపిస్తున్నారని సమాచారం. ప్రధానంగా బాన్సువాడ రేంజ్‌లోని బడాపహాడ్, లకా్ష్మపూర్, జలాల్‌పూర్, అటవీ ప్రాంతాల నుంచి విలువైన టేకు దుంగలను తరలిస్తున్నారు. వీటిని నగరంలోని రహస్య ప్రదేశాలలో నిలువ ఉంచి అవసరం ఉన్న వారికి అక్కడి నుంచి చేరవేస్తున్నట్లు తెలిసింది.
నిజామాబాద్ మండలంలోని మంచిప్ప, కులాస్‌పూర్, బాడ్సీ, మోపాల్, మల్లారం ప్రాంతాల నుంచి కూడా ప్రతి రోజు వివిధ వాహనాలలో, సైకిళ్లపై, ఆటోల్లో వీటిని నగరానికి చేరవేస్తారు. ఇలా చేర వేసిన వాటిని వంటచెరుకుగా నగరంలోని వివిధ వారికి విక్రయిస్తారు.
పట్టించుకోని అధికారులు
తమ కళ్ల ఎదుటే ఉన్న అడవి సంపద తరలి పోతున్నా సంబంధిత అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. పెట్రోలింగ్ చేసే సమయంలో వారి కంటికి కనిపించిన వారినే నామ మాత్రంగా జరిమానాలు విధుస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించి చెట్లను నరకకుండా పర్యవేక్షించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టుకున్న కలప వివరాలు ఇలా ఉన్నాయి
2013 జనవరి నుంచి 2014 జనవరి వరకు అధికారులు పట్టుకున్న కలప విలువ సుమారు రూ. 22 లక్షలుంటుంది. ప్రతి నెల 20న నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో వీటిని వేలం వేస్తారు. ఇందులో నుంచి సుమారు రూ. 12 లక్షల విలువ చేసే కలపను విక్రయించి ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు.
బడాబాబుల సంగతేమిటో
Published Mon, Feb 17 2014 2:52 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement