వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా, రాష్ట్ర అధికార...
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజును ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించినట్లు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
డేవిడ్‌రాజు గతంలో జెడ్పీ చైర్మన్ గా, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో వైపాలెం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. సామాజిక, రాజకీయ అంశాలపై పట్టుంది. తనపై నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి డేవిడ్‌రాజు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.