విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ గతంలో ఒప్పుకున్న అంశాలపై నేడు తిరగబడటం సరికాదని అన్నారు. విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ పథకం నుంచి హైదరాబాద్పై గవర్నర్ అధికారాల వరకూ కేసీఆర్ మెళిక పెడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు.