రాపూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని వెంకయ్యస్వామి ఆలయంలో జరిగిన ప్రమాదంలో ఓ భక్తుడు మృతి చెందాడు. మంగళవారం నుంచి ఇక్కడి ఆలయంలో వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. నాయుడుపేట మండలానికి చెందిన పెంచలయ్య(50) అనే భక్తుడు రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ వైరు తెగి పడిపోగా, దాన్ని సరిచేసేందుకు ప్రయత్నించాడు. విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.