devotee died
-
తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో అపశ్రుతి.. (ఫొటోలు)
-
సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటుచేసుకుంది. జాతరకు భక్తులు పోటెత్తడంతో.. గుండెపోటుతో అమన్‌గల్‌కు చెందిన విజయ అనే మహిళ మృతిచెందింది. దీంతో సలేశ్వరం జాతరలో మరణించిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కసలాట జరిగి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మృతులను నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్‌గా (32) గుర్తించారు. కాగా నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరంలో కొలువై ఉన్న శివుడిని (లింగమయ్య) దర్శించుకోవాలంటే దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 4 కి.మీ. దూరం కాలినడకన నడవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సలేశ్వరం యాత్రకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఈ యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుండటం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సలేశ్వరంలో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడి లోయల్లో భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల అసంతృప్తి సలేశ్వరం యాత్ర ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమవ్వగా శుక్రవారం వరకు జాతర కొనసాగనుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమస్తారు. -
విషాదం.. నదిలో మొసలి దాడిలో భక్తులు మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నది దాటుతున్న భక్తులపై నీటిలో ఉన్న మొసలి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది భక్తులు రాజస్థాన్‌లోని కైలా దేవీ ఆలయానికి వెళ్లి మొక్కలు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో శివపురి జిల్లాలోని చిలవాడ్ గ్రామంలో ఉన్న చంబల్ నది వద్దకు చేరుకున్నారు. అయితే, వారు అక్కడికి వెళ్లిన సమయానికి నది దాటేందుకు వంతెన, పడవ అందుబాటులో లేకపోవడంతో వారు చంబల్ నదిని దాటేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారంతా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నదిలోకి దిగి గట్టు దాటేందుకు ముందుకు సాగారు. ఇంతలో అక్కడే నాచులో నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దీంతో, వారంతా భయంతో నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సయమంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న వారు మొసలి దాడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్.. ఎనిమిది మందిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీసింది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, వారిలో మొసలి ఎంత మందిని పొట్టనపెట్టుకుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతయ్యారు. -
మహానందిలో అపశ్రుతి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా మహానందిలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన రత్నాలు(40) అనే మహిళ మహానందీశ్వరుని దర్శనానికి వచ్చి కోనేటిలో స్నానం చేస్తుండగా పిట్స్ రావడంతో ఆమె నీట మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
అలిపిరిమార్గంలో భక్తుడి మృతి
తిరుమల: శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళుతున్న ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన రఘు(28) అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున కాలినడకన తిరుమల వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో భక్తుడు మృతి
రాపూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని వెంకయ్యస్వామి ఆలయంలో జరిగిన ప్రమాదంలో ఓ భక్తుడు మృతి చెందాడు. మంగళవారం నుంచి ఇక్కడి ఆలయంలో వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. నాయుడుపేట మండలానికి చెందిన పెంచలయ్య(50) అనే భక్తుడు రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ వైరు తెగి పడిపోగా, దాన్ని సరిచేసేందుకు ప్రయత్నించాడు. విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.