తిరుపతి : ఆర్టీసీ సమ్మె ప్రభావం తిరుమల భక్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. దాంతో భక్తులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించటంతో సందడిలో సడేమియాలాగా...ప్రైవేటు ట్రావెల్స్ దందా నడుస్తోంది. విపరీతంగా రేట్లు పెంచి భక్తులను, ప్రయాణికులను దండుకుంటున్నాయి.
మరోవైపు ఆర్టీసీ కార్మికులకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారన్నారు. కార్మికుల సమ్మెను భక్తులు అర్థం చేసుకోవాలని నారాయణ కోరారు.
కాగా ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలం అవటంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.27 శాతంగా ఉన్న మధ్యంతర భృతి(ఐఆర్)ని ఫిట్‌మెంట్‌గా మారుస్తామని, మెరుగైన వేతన సవరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాలు తోసిపుచ్చడంతో సమ్మె అనివార్యమైంది.
తిరుమల వెళ్లేందుకు భక్తుల అవస్థలు
Published Wed, May 6 2015 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement