
త్వరలో ఏపీలో పర్యటిస్తా: దిగ్విజయ్
న్యూఢిల్లీ : త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వస్తానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా తాను పర్యటించనున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు జగన్ వ్యక్తిగతమని ఆయన అన్నారు. కాగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ...ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే యోచనలో ఉన్నారు.