నగదు విషయమై ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మెకానికిషెడ్‌ను...
- మెకానిక్‌షెడ్, వాహనాలకు నిప్పంటించిన దుండగుడు
నెల్లూరు(క్రైమ్) : నగదు విషయమై ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మెకానికిషెడ్‌ను, రెండు వాహనాలకు దుండగుడు నిప్పంటించాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మూలాపేటలోని వేద సంస్కృత పాఠశాల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. కోటమిట్టకు చెందిన ఎస్‌కె ఆసీఫ్ మూలాపేట వేద సంస్కృత పాఠశాల సమీపంలో మెకానిక్‌షెడ్ నిర్వహిస్తున్నాడు. కోటమిట్టకు చెందిన ఎస్‌కె మాతిన్ వారం రోజుల క్రితం అతని వద్దకు వచ్చి సెల్‌ఫోను పెట్టుకొని రూ.3 వేలు నగదు ఇవ్వమని కోరాడు.
సెల్‌ఫోను తీసుకొన్న ఆసీఫ్ రేపు, మాపు అంటూ డబ్బులు ఇవ్వకుండా నిందితుడిని తిప్పుకొంటున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన మాతిన్ సోమవారం ఆసీఫ్‌తో గొడవపడి నీ మెకానిక్‌షెడ్‌ను పగులగొడతానిని చెప్పాడు. ఈనేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున మాతిన్ షెడ్‌కు నిప్పం టిం చాడు. మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఆటో, డిస్కవరీ బైక్ సైతం దగ్ధమైయ్యాయి. స్థానికుడు భాస్కర్ మం ట లను గమనించి ఆసీఫ్‌కు ఫోనుచేసి సమాచారం అందించాడు. ఆసీఫ్ వచ్చేలోపే అన్నీ అగ్నికి బూడిదయ్యాయి. ఈమేరకు బాధితుడు నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రఘునాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.