28 మంది డీటీలకు స్థానచలనం
బి.కొత్తకోట తహశీల్దారు సస్పెన్షన్
పెద్దమండ్యం ఎమ్మార్వో తొలగింపు
{పకటించిన డీఆర్‌వో విజయ్‌చందర్
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో 39 మంది తహశీల్దార్లను బదిలీ చేసిన ట్లు డీఆర్‌వో విజయ్‌చందర్ ప్రకటించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది బదిలీలను పారదర్శకంగా చేపట్టామన్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులతోపాటు, మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని కూడా కొందరిని జీవో ప్రకారం బదిలీ చేశామన్నారు.
అలాగే మూడేళ్లు సర్వీసు పూర్తికాని ఉద్యోగుల్లో కూడా ఫిర్యాదులున్న వారిని బదిలీ చేసినట్లు ఆయన తెలియజేశారు. మొత్తం 100 మంది ఉద్యోగులను బదిలీ చేశామన్నారు. ఇందులో 39 మంది తహశీల్దార్లు, 28 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 18 మంది సీనియర్ అసిస్టెంట్‌లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు టైపిస్టులు, ఏడుగురు వీఆర్వోలు ఉన్నట్లు వెల్లడించారు. కాగా బి.కొత్తకోట తహశీల్దారును సస్పెండ్ చేసినట్లు, పెద్దమండ్యం తహశీల్దారును విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు.