రావులపాలెం, న్యూస్‌లైన్ : అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తూర్పు నేతలు శుక్రవారం గుంటూరుకు తరలివెళ్లారు. అమలాపురం పార్లమెంటరీ పరిధిలోని పార్టీ నేతలు రావులపాలెం చేరుకుని, ఇక్కడి నుంచి వాహనాల్లో బ యలుదేరారు. పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ మం త్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరె డ్డి, కోఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు, మర్తి జయప్రకాష్, భూపతిరాజు సుదర్శనబాబు, వాణిజ్య వి భాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు, పారి శ్రామిక విభాగం జిల్లా కన్వీనర్ మంతెన రవి రాజు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ మార్గన గంగాధరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు కె.రాజబాబు, వల్లూరి రామకృష్ణ, వేగిరాజు సా యిరాజు, సిరిపురం శ్రీను, మెడిశెట్టి సూర్యభాస్కరరావు, గణేష్ చౌదరి, పెట్టా శ్రీను, మండల యువత కన్వీనర్ కర్రి నాగిరెడ్డి తరలివెళ్లారు.
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పయనం
రాజమండ్రి సిటీ : విజయమ్మ దీక్షకు సంఘీభా వం తెలిపేందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కార్లతో ర్యాలీగా గుంటూరు బయలుదేరి వెళ్లారు. స్థానిక కోటగుమ్మం వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు నయూమ్, మంచాల బాబ్జీ, కానుబోయిన సాగర్, అజ్జరపు వాసు, మానే దొరబాబు, బొమ్మనమైన శ్రీనివాస్, కె.జోగారావు, కేవీఎల్ శాంతి, కల్యాణ్ శ్రీను పాల్గొన్నారు.
జక్కంపూడి సంఘీభావం
విజయమ్మ ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఇతర నేతలతో క లిసి శుక్రవారం గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. నాయకులు జక్కంపూడి రాజా, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ నాయకులు పోలు కిరణ్‌మోహన్ రెడ్డి, గుర్రం గౌతమ్, ఇసుకపల్లి శ్రీనివాస్, గారా త్రినాథ్ ఉన్నారు
విజయమ్మ దీక్షకు తరలిన ‘తూర్పు’ నేతలు
Published Sat, Aug 24 2013 2:16 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement