విభజన నిర్ణయంపై వైసీపీ సేనల సమరం | Division decision YSR CP combat troops | Sakshi
Sakshi News home page

విభజన నిర్ణయంపై వైసీపీ సేనల సమరం

Published Wed, Oct 2 2013 3:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

సాక్షి, ఏలూరు : ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలుస్తూ.. వారి సమస్యలపై సత్వరమే స్పందిస్తూ.. జనం కోసం ఉద్యమాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాయి. అన్నదమ్ముల్లాంటి తెలంగాణ, సీమాంధ్రులను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తులపై సమైక్య సమరం చేయడానికి సిద్ధమయ్యాయి.

సాక్షి, ఏలూరు : ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలుస్తూ.. వారి సమస్యలపై సత్వరమే స్పందిస్తూ.. జనం కోసం ఉద్యమాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాయి. అన్నదమ్ముల్లాంటి తెలంగాణ, సీమాంధ్రులను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తులపై సమైక్య సమరం చేయడానికి సిద్ధమయ్యాయి. విభజన ప్రకటన వెలువడనుందనే సంకేతాలు అందిన మరుక్షణమే వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులను తృణప్రాయంగా వదిలి ఉద్యమంలోకి వచ్చారు.  రెండు నెలలుగా సమైక్యాంధ్ర కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కుట్రల చెరను ఛేదించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి రావడంతోనే సమరోత్సాహంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. 
 
 ఈ మహాయజ్ఞాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. బుధవారం ప్రారంభమయ్యే ఈ మహాయజ్ఞం ఆంధ్ర రాష్ర్ట అవతరణ దినోత్సవం వరకూ సాగుతుంది. ఇందులో భాగంగా వైసీపీ శ్రేణులు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడుతున్నాయి. దీనికి ఎక్కడికక్కడ విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా మంగళవారం సమావేశాలు నిర్వహించారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొయ్యలగూడెంలో 48 గంటల రిలే నిరాహార దీక్షను బుధవారం ఉదయం నుంచి  ప్రారంభిస్తున్నారు.
 
 భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీని వాస్ దీక్ష చేపడుతున్నారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సర్రాజు ఆకివీడు సెంటర్లో దీక్ష చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణం లో దీక్షకు కూర్చుంటున్నారు. పాలకొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గోపాలపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు దొడ్డిగర్ల సువర్ణరాజు, తలారి వెంకట్రావులతో పాటు మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత దేవరపల్లిలో దీక్ష చేపడుతున్నారు.  తాడేపల్లిగూడెం పోలీ స్ ఐలండ్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, తణుకులో నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య దీక్ష చేయనున్నారు. ఏలూరు పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో రిలేదీక్షలో కూర్చుంటున్నారు. 
 
 కొవ్వూరులో నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషే న్‌రాజు, జంగారెడ్డిగూడెంలో  చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, కర్రా రాజారావు, నిడదవోలులో నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ రిలేదీక్షలు చేయనున్నారు. గోపన్నపా లెంలో దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ మార్టేరులో  దీక్షకు సన్నద్ధమవుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement