రాష్ట్రపతికి ఏపి విభజన సవరణ బిల్లు | Division of AP amendment bill to the President | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఏపి విభజన సవరణ బిల్లు

Published Mon, Jul 7 2014 4:49 PM | Last Updated on Sat, Aug 18 2018 9:18 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ - Sakshi

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణల బిల్లును  కేంద్రం  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  పంపింది. రాష్ట్రపతి అభిప్రాయం వెల్లడించిన తర్వాత  కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ సవరణ బిల్లుపై టిఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలుపుతూ రూపొందిన బిల్లును ఆ పార్టీ వ్యతిరేకిస్తూ లోక్సభలో నోటీస్ కూడా ఇచ్చింది. ఒక రాష్ట్రం సరిహద్దులు మార్చాలంటే ఆయా ప్రభుత్వాల అసెంబ్లీలకు పంపాలన్నది టీఆర్‌ఎస్‌ వాదన.

ఈ పరిస్థితులలో ఈ బిల్లును వాయిదా వేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ లోక్సభ స్పీకర్‌ను కోరారు. ఆ తరువాత ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement