
మహిళ కడుపులోని కణితను తొలగిస్తున్న వైద్యులు
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ కడుపులోని ఏడు కిలోల కణితిని మంగళవారం తొలగించారు. వైద్యులు కథనం ప్రకారం... చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన టి.ఝాన్సీ(28) మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ ఉంది. అనేక వైద్యశాలలో చికిత్స పొందిన పూర్తిస్థాయిలో నొప్పి తగ్గలేదు. దీంతో ఆమె మూడు రోజుల కిందట తెనాలి జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చారు. ఆమెకు అన్ని పరీక్షలు చేయగా కడుపులో కణితి ఉన్నట్లు నిర్ధారించారు. వైద్యశాల సూపరింటెండెంట్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం.సనత్‌కుమారి నేతృత్వంలో ఏడు కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం మహిళ క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment