
సీమాంధ్ర పేరును తెలుగు నాడుగా మార్చాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అనివార్యమైతే సీమాంధ్ర పేరును తెలుగునాడుగా మార్చాలని మంత్రి డొక్కా మాణిక్య ప్రసాదరావు తెలిపారు. సాగు భూములను పరిశ్రమలకు ఇవ్వడంపై నిషేధం విధించాలని కోరారు. బిల్లుకు సంబంధించి ఆయన కొన్ని సవరణలను సభాపతికి సూచించిన డొక్కా.. సీమాంధ్ర పేరును తెలుగు నాడుగా మార్చాలన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ స్థానలను పెంచాలని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న భద్రాచలం డివిజన్ ను సీమాంధ్ర ప్రాంతంలో కలపాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాలను పునర్విభజన చేయాలని సూచించారు.