తిరుపతి : విద్యుత్ కనె క్షన్లను ఆధార్‌తో అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వినియోగదారులు ఆధార్ కా ర్డులు జిరాక్స్ తీయించి విద్యుత్ అధికారులకు సమర్పించే ప్రయత్నాలు చేస్తూ నే... అసలు విద్యుత్ కనెక్షన్లకు ఆధార్‌తో లింక్ ఏమిటబ్బా అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అంతరంగం అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు. గృహావసరాలకు సరఫరా చేస్తున్న కరెం ట్‌పై ప్రభుత్వం యూనిట్‌కు రూ.8.50 సబ్సిడీ ఇస్తోంది. యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వం 11 రూపాయలు పైబడి ఖర్చు చేయాల్సి ఉంది.
అయితే గృహావసరాలకు కరెంట్ వినియోగానికి సంబంధించి సామాన్యుల మొదలు సంపన్నుల వరకు సబ్సిడీ పొందుతున్నారు. ఒకే ఒక ఇల్లు ఉన్నవారితో పా టు అపార్ట్‌మెంట్‌లు నిర్మించుకున్నవా రు సబ్సిడీ లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీకి అనర్హుల ఏరివేత పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ ఏరి వేత సక్రమంగా అమలు జరగాలంటే ఆధార్‌తో అనుసంధానం ఒక్కటే మా ర్గంగా ఎంచుకున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యుత్ కనెక్షన్లను ఆధార్‌తో అసుసంధానం చే యాలని ఆదేశాలు జారీ చేసింది.
దాం తో అధికారులు వినియోగదారుల నుం చి ఆధార్ వివరాలు సేకరించే పనిలో ప డ్డారు. ఆధార్ లింక్‌తో సబ్సిడీకి అర్హుల ను తేల్చి మిగతా వారికి సబ్సిడీ కరెం ట్‌ను కట్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచ న అని సమాచారం.. ఇది పక్కాగా అమలైతే సబ్సిడీ ధరకు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారని తద్వారా రాష్ట్రంలో విద్యుత్ వాడకం త గ్గించుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యం లో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించి పె ట్టుబడులు పెట్టగలిగిన వారికి నెడ్‌క్యాప్ ద్వారా సబ్సిడీ మంజూరు చేయించి ఇళ్లై పె సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
ఇది ఒక మార్గం కాగా ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నా యి. తద్వారా వినియోగదారుల నుంచి సెల్‌ఫోన్ ప్రీపెయిడ్ సిమ్ కార్డుల తరహాలో ముందుగానే డబ్బు వసూలు చేస్తారు. చెల్లించిన డబ్బు కంటే ఎక్కువ కరెంట్ వాడడానికి వీలు ఉండదు. ఆటోమేటిక్‌గా కరెంట్ సర ఫరా ఆగిపోతుంది. కరెంట్ కావాలంటే వినియోగదారుడు సిమ్‌ను రీచార్జింగ్ చేయించుకోవాల్సిందే. చిత్తూరు జిల్లాలో 2013 నవంబర్ ఆఖరు నాటికి 8,99,471 డొమెస్టిక్ (గృహావసరాలు)విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానిస్తే వీటిలో 50 శాతానికి పైగా సబ్సిడీకి అర్హత కోల్పోయే అవకాశం ఉంది.
డొమెస్టిక్ కనెక్షన్లపై సబ్సిడీ ఎత్తివేత?
Published Mon, Sep 8 2014 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement
Advertisement