అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అదనంగా 25 లక్షల రూపాయల కట్నం తేవాలని తన భర్త అనిల్‌కుమార్ వేధిస్తున్నారని అతడి భార్య దివ్యలక్ష్మి నగరంలోని పీఎంపాలెం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కట్నం కోసం కాల్చుకు తింటున్నాడని ఫిర్యాదులో వాపోయింది. అనిల్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దివ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిల్‌కుమార్ కు విచారించేందుకు సిద్దమవుతున్నారు.