
బీజేపీలో చేరిన డాక్టర్ బాబ్జి
పాలకొల్లు: ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (డాక్టర్ బాబ్జి) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్లు చెరుకూరి సత్యవర్మ, ఉన్నమట్ల కబర్టి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇరగం పాపారావులో సోమవారం బీజేపీలో చేరారు.
గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి పాలకొల్లు అసెంబ్లీ స్థానానికి టికెట్ ఆశించిన బాబ్జి భంగపడ్డారు. అనంతరం టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు. 2004లో బాబ్జి ఎమ్మెల్యేగా గెలుపొందినా.. తరువాత 2008 లో ఓటమి పాలయ్యారు.