విజయనగరంటౌన్/క్రైం: ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన ఏపీ డీఎస్సీ -2014 (టెట్ కమ్ టిఆర్‌టీ) పరీక్షా ఫలితాలను విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీ ైవె వీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. పట్టణంలోని పలు కోచింగ్ సెంటర్‌లలో అభ్యర్థులు తమ హవా కొనసాగించారు. జామి మండ లానికి చెందిన సిరిపురపు రామలక్ష్మి (150.66/180) మార్కులు సాధించారు. అదేవిధంగా శ్రీకాకుళానికి చెందిన ఎ.ధర్మరాజు 150 మార్కులు సాధించారు. హైతీనగరానికి చెందిన డి.బాలామణి 153.11 మార్కులు సాధించింది. వీరితో పాటు పలు కోచింగ్ సెంటర్‌లలో ప్రతిభ చూపిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలో శ్రీశ్రీ ప్రభంజనం
స్దానిక కానుకుర్తివారి వీధిలో ఉన్న శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలో హవా కొనసాగించారు. జామి మండలానికి చెందిన సిరిపురపు రామలక్ష్మి 150.66 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు డెరైక్టర్ కె..సంధ్యారాణి తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎ.ధర్మరాజు 150 మార్కులు, సిహెచ్.తేజావతి 145.60, బొంగు సంతోష్‌కుమార్ 145మార్కులు, కోటా శ్రీను 141 మార్కులు, ఎస్.గురునాథరావు 143.15మార్కులుసాధించారు. అదేవిధంగా విజయనగరానికి చెందిన ఎవి.నాయుడు 143.20 మార్కులు, బి.అనూష 141.37, పి.సత్యనారాయణ 142.35, కామేష్ 142.8 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు.
శ్రీ సాహితీ కోచింగ్ సెంటర్‌కు చెందిన అభ్యర్థులు డీఎస్సీ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఎస్‌జిటిలో శ్రీకాకుళం హైతీనగరానికి చెందిన డి.బాలామణి 153.11 మార్కులు సాధించింది. అదేవిధంగా విజయనగరం జిల్లా కణపాకకు చెందిన తాళ్లపూడి అనూరాధ 147 మార్కులు, పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సుంకరి నందిని 145, కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన అరసాడ స్రవంతి, గరివిడి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బోడసింగి వెంకటరమణ 142 మార్కులు, 143 మార్కులు, మక్కువ మండలం వెంకట భైరిపురం గ్రామానికి చెందిన కూర్మదాసు జాషువ 142 మార్కులు సాధించారు. అదేవిధంగా పద్మనాభం మండలానికి చెందిన సాధనాల రాజేశ్వరి 140 మార్కులు సాధించారు. మొత్తం 138 మంది ఎస్‌జిటి అభ్యర్థులకు గానూ 130 నుంచి 140 మధ్య 70 మంది, 140 మార్కులు దాటి 12 మంది అభ్యర్థులు మార్కులు సాధించారని కోచింగ్ సెంటర్ డెరైక్టర్లు రెడ్డిపల్లి రమేష్, అప్పలరాజు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులను డెరైక్టర్లు, ప్రతినిధులు పి.భాస్కరరావు, ఎన్‌విడి.ప్రసాద్, కిశోర్‌లు అభినందించారు.
పట్టణంలో సాధన కోచింగ్ సెంటర్‌కు చెందిన అభ్యర్థులు విజయదుంధుబి మోగించారు. మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన పొదిలాపు తౌడు 145 మార్కులు సాధించారు. అదేవిధంగా గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామానికి చెందిన బి.రమణ 143.29 మార్కులు, మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామానికి చెందిన రమేష్‌కు 137.29, కొమరాడ మండలం మాదలంగి గ్రామానికి చెందిన ఎ.సంతోష్ కుమార్ 143.02 మార్కులు సాధించారు. బి.మణికంఠ 141, శ్రీకాకుళానికి చెందిన ఎమ్.రాము 137 మార్కులు సాధించారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన జి.అప్పలనాయుడు (151/200)మార్కులు సాధించారు. అదేవిధంగా కొత్తవలసకు చెందిన ఎ.వెంకటరావు 150 మార్కులు, విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన సిహెచ్.శారద 141 మార్కులు, దత్తిరాజేరు మం డలం గడసాంగ్రామానికి చెందిన గౌరి 138.10 మార్కులు సాధించారు. తెలుగు విభాగంలో విశాఖ జిల్లాలో సిహెచ్.శారద (145/200)మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు సాధన అకడమిక్ అడ్వయిజర్ తిరుపతిరావు , డెరైక్టర్ గోవింద్‌లు అభినందించారు.
డీఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల
Published Wed, Jun 3 2015 12:16 AM | Last Updated on Fri, May 25 2018 5:45 PM
Advertisement