ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు చిన్న వయస్సులోనే దారి తప్పాడు. వయసులో తనకంటే పెద్దదైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగక పెళ్లి చేసుకోవాలంటూ పోరు పెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కసి పెంచుకున్నాడు. చివరకు ఆమెను గొడ్డలితో అత్యంత కిరాతంగా నరికి చంపాడు. ఆ తరువాత గంటల వ్యవధిలోనే తనూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనం ఓ రెండు నిండు ప్రాణాలను బలిగొనగా ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
చిన్నమండెం, న్యూస్‌లైన్: చిన్నమండెం మండలం పాత వట్టం వారిపల్లెకు చెందిన కాకలపల్లె వెంకటక్షమ్మ, నడిపి రెడ్డెన్న దంపతు ల కుమారుడు ఆంజినేయులు(24) పురుగుల మందు తాగి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని మామిడి తోటలో తన వెంట తెచ్చుకున్న ఐదు రకాల పురుగుల మందులను బకెట్‌లో కలుపుకుని వాటిని తాగి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. రాయచోటి రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, చిన్నమండెం ఎస్‌ఐ యోగీంద్ర, పీఎస్‌ఐ నాగమురళీ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రియురాలిని గొడ్డలితో కిరాతకంగా నరికి...
చిత్తూరు జిల్లా పెద్దమండెం మండలం గౌనివారిపల్లెకు చెందిన తుర్లు అన్నయ్య మొదటి భార్య మస్తానమ్మ అనారోగ్యంతో చనిపోగా ఆయన సీటీఎం పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మను 12 ఏళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిచెర్లలోని టమాట నర్సరీలో పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో పార్వతమ్మతో రెండున్నరేళ్ల నుంచి ఆంజినేయులు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఆంజినేయు లు కోరారు. కొన్నాళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆమె అతన్ని దూరం పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని ఆం జినేయులు ఆమెపై పగతో రగిలిపోయేవాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదను కోసం వేచి చూస్తున్న అతనికి సమ యం రానే వచ్చింది. నర్సరీకి వెళ్లిన భర్తకు భోజనం తీసుకుని ఒంటరిగా బయలుదేరిన పార్వతమ్మను కలిచెర్ల-కేశాపురం మార్గంలోని చెట్ల పొదల్లో మంగళవారం దారి కాచి కొడవలితో విచక్ష ణారహితంగా ఆమెపై దాడి చేశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆ దారిన బైక్‌లో వెళ్తున్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. ఆమెను మదనపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది.
ప్రాణభయంతో బలవన్మరణం
ఈ సంఘటనతో భయపడ్డ ఆంజినేయులు తీవ్రంగా భయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున తమ స్వగ్రామమైన పాత వట్టంవారిపల్లె సమీపంలోని మామిడి తోట వద్దకు చేరుకున్నాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందులను బకెట్‌లో కలుపుకుని వాటిని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో లభ్యమైన లేఖలో పార్వతమ్మతో తనకున్న సంబంధాలు, తమ మధ్య జరిగిన గొడవల గురించి ఆంజినేయులు అనేక విషయాలు రాసి ఉండడం గమనార్హం. దీంతో పాటు పలు విషయాలు సెల్‌ఫోన్‌లోనూ రికార్డు చేసుకున్నట్లు తెలిసింది.
దారి తప్పి.. బతుకు బుగ్గి..
Published Thu, Dec 5 2013 2:57 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement