వేముల :
మండలంలోని వేల్పుల గ్రామానికి చెందిన ఓబెళ్ల ప్రకాష్(25) అనే వ్యక్తి నిప్పంటించుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓబెళ్ల ప్రకాష్ చిన్నతనంలోనే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అప్పట్లో ఆరోగ్యం కుదటపడినా వయస్సు పెరిగే కొద్దీ నరాల బలహీనతతో బాధపడేవాడు. దీంతో మానసికంగా కుంగిపోయాడు. ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఖాళీగా ఉండేవాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇంటిలో నుంచి అరుపులు, కేకలు వినపడటంతో నాయనమ్మ గట్టిగా కేకలు వేయగా.. చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఒళ్లంతా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్ తెలిపారు.
జీవితంపై విరక్తి చెంది..
Published Sun, Jul 17 2016 9:59 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement