kirocine
-
భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): భార్యభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది. తుమకూరు నగరం జయనగరలో ఆదివారం మధ్యాహ్నం నారాయణ (45), భార్య అన్నపూర్ణమ్మ కొట్లాటకు దిగారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని నారాయణ అనుమానించేవాడని సమాచారం. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకొని భర్త పైన పోసి నిప్పు అంటించింది. మంటలో కాలిపోతున్న భర్త కిందపడిపోగా అతని తల పైన బండరాయితో కొట్టడంతో తల ఛిద్రమైంది. చుట్టుపక్కలవారు జయనగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
జీవితంపై విరక్తి చెంది..
వేముల : మండలంలోని వేల్పుల గ్రామానికి చెందిన ఓబెళ్ల ప్రకాష్(25) అనే వ్యక్తి నిప్పంటించుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓబెళ్ల ప్రకాష్ చిన్నతనంలోనే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అప్పట్లో ఆరోగ్యం కుదటపడినా వయస్సు పెరిగే కొద్దీ నరాల బలహీనతతో బాధపడేవాడు. దీంతో మానసికంగా కుంగిపోయాడు. ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఖాళీగా ఉండేవాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇంటిలో నుంచి అరుపులు, కేకలు వినపడటంతో నాయనమ్మ గట్టిగా కేకలు వేయగా.. చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఒళ్లంతా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. -
800 లీటర్ల నీలి కిరోసిన్ పట్టివేత
ఉప్పల్: గుట్టుగా సాగుతున్న నీలి కిరోసిన్ దందా పోలీసుల తనిఖీల్లో బట్లబయలైంది. ఉప్పల్ పారిశ్రామికవాడ కేంద్రంగా నీలి కిరోసిన్ దందా జరుగుతోందన్న సమాచారంతో ఉప్పల్ పోలీసులు గురువారం మాటు వేసి ఏపీ25డబ్యూ7230 ఆటోలో తరలిస్తున్న 800 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... ఉప్పల్ నుంచి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో ఉప్పల్ పారిశ్రామిక వాడలోకి మళ్లుతుండగా మోడ్రన్ బ్రెడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నీలి కిరోసిన్నుతో పాటు డ్రైవర్, ఆటోను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.