గుట్టుగా సాగుతున్న నీలి కిరోసిన్ దందా పోలీసుల తనిఖీల్లో బట్లబయలైంది.
ఉప్పల్: గుట్టుగా సాగుతున్న నీలి కిరోసిన్ దందా పోలీసుల తనిఖీల్లో బట్లబయలైంది. ఉప్పల్ పారిశ్రామికవాడ కేంద్రంగా నీలి కిరోసిన్ దందా జరుగుతోందన్న సమాచారంతో ఉప్పల్ పోలీసులు గురువారం మాటు వేసి ఏపీ25డబ్యూ7230 ఆటోలో తరలిస్తున్న 800 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... ఉప్పల్ నుంచి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో ఉప్పల్ పారిశ్రామిక వాడలోకి మళ్లుతుండగా మోడ్రన్ బ్రెడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నీలి కిరోసిన్‌నుతో పాటు డ్రైవర్, ఆటోను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.