నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: నకిలీ మద్యం వేటలో ఎక్సైజ్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. గు రువారం తాడూరు మండలం చర్లతిర్మలాపూర్‌లో నకిలీ మద్యం తయారు చేస్తూ ప ట్టుబడిన నిందితులను విచారించగా... వారిచ్చిన సమాచారంతో మరో డంప్ బ యటపడింది. పెద్దకొత్తపల్లి మండలం పె రుమాళ్లపల్లి గ్రామ సమీపంలోని ఓ మొ క్కజొన్న చేనులో దాచి ఉంచిన రూ. 1.50 లక్షల విలువైన 35 కాటన్ల ఆఫీసర్స్ ఛా యిస్ విస్కీ కాటన్లను ఎక్సైజ్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. గురువారం తిర్మలాపూర్ లో రూ. 2 లక్షల విలువై న మద్యం బాటిళ్లు, స్పిరిట్, సారా తయారీ సామగ్రి, స్టిక్కర్లు, డక్కన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో నాగర్‌కర్నూల్ ఎ క్సైజ్ సూ పరింటెండెంట్ కె.రఘురాం వివరాలు వెల్లడించారు.
‘కోడేరు మండలం కదిరెపహాడ్‌కి చెంది న బాదగోని నాగరాజు చర్లతిర్మలాపూర్‌లోని తన అత్తగారింట్లో ఉంటూ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏ ర్పాటు చేశాడు. ఇందుకుగాను నకిలీ మద్యం తయారీ లో సిద్ధహస్తుడైన మానవపాడు మండలం అమరవాయికి చెంది న బాలగోని శ్రీనివాస్‌గౌడ్‌ను, అతనికి సహకరించేందుకు తమ సమీప బంధువులు పెబ్బేర్‌కు చెందిన పట్టపర్ల కిరణ్‌కుమార్‌గౌడ్, పట్టపర్ల శివప్రసాద్‌గౌడ్‌లను రప్పించాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ముందు నుంచే వీరు మద్యం తయారీని ప్రారంభించారు.
తయారైన మద్యాన్ని నాగరాజుగౌడ్, అతని అనుచరులు మార్కెటింగ్ చేస్తూ వచ్చారు. తిర్మలాపూర్‌లో అదుపులోకి తీసుకున్న వారు ఇచ్చిన సమాచారం మే రకు శుక్రవారం పెరుమాళ్లపల్లిలో దాడులు నిర్వహిం చగా బయ్యపు మహేశ్వర్‌రెడ్డికి చెందిన మొక్కజొన్న చే నులో దాచి ఉంచి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని’ ఈఎస్ తెలిపారు. నిందితులు శ్రీనివాస్‌గౌడ్, నాగరాజుగౌడ్, కిరణ్‌కుమార్, శివప్రసాద్, మహేశ్వర్‌రెడ్డిలను అరెస్టు చేసి, కేసు నమోదు చే శామన్నారు. స మావేశంలో ఏసీ అశోక్‌కుమార్, డీసీ గోపాలకృష్ణ, ఇన్‌చార్జి ఏఈఎస్ ఎస్.సైదులు పాల్గొన్నారు.
మరో నకిలీ మద్యం డంప్ స్వాధీనం
Published Sat, Aug 24 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement