లిక్కర్.. నో ఫికర్!
సిద్దిపేట: పెద్దపెద్ద మాల్స్, సూపర్‌మార్కెట్‌లకే పరిమితమైన బార్‌కోడ్ బిల్లింగ్ సిస్టమ్ ఇక మద్యం దుకాణాల్లోనూ కానరానుంది. మద్యం బాటిల్‌ను స్కాన్‌చేసి వినియోగదారులకు బిల్లులు చేతికి అందేలా ఎక్సైజ్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్(హెచ్‌పీఎఫ్‌ఎస్)కు శ్రీకారం చుట్టనుంది.
హెచ్‌పీఎఫ్‌ఎస్ అమలుతో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు అడ్డుకట్ట వేయటంతోపాటు ఎంఆర్‌పీకే మద్యం అమ్మకాలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. త్వరలో జిల్లాలోని 162 దుకాణాల్లో మద్యం వ్యాపారులు తప్పనిసరిగా వినియోగదారు కోరిన మద్యం బ్రాండ్ సీసాను స్కాన్ చేసి కంప్యూటర్ బిల్లు ఇవ్వా ల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ.. ప్రతి మద్యం బాటిల్‌పై బార్‌కోడింగ్ కూడుకున్న 2డీ హోల్‌గ్రామ్‌ను ఏరాఠ956?టు చేయనుంది.
2డీ హోలోగ్రామ్‌ను స్కాన్ చేసిన వెంటనే మద్యంబాటిల్ ఎప్పుడు ఉత్త అయ్యింది?అక్కడి నుంచి ప్రభుత్వ మద్యం నిల్వకేంద్రానికి ఎప్పుడు చేరుకుంది? ఆతర్వాత మద్యం షాపునకు ఎప్పుడువచ్చింది? తదితర వివరాలను కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. స్కాన్ పూర్తయిన వెంటనే మద్యం బాటిల్ హిస్టరీతోపాటు మినిమమ్ రిటైల్ ప్రైస్(ఎంఆర్‌పీ)తో కంప్యూటర్ బిల్లు వస్తుంది. ఈబిల్లును వ్యాపారులు వినియోగదారులకు తపసరిగా అందజేయాల్సిఉంటుంది. జిల్లాలో నాన్‌డ్యూటీపెయిడ్‌లిక్కర్ పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నట్టుతెలుస్తోంది.
లాభాల కోసం మద్యంవ్యాపారులు పొరుగునే ఉన్న కర్ణాటక,మహారాష్ట్ర నుంచి అక్రమంగా నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్‌డీపీ) తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు కొంతకాలంగాఆరోపణలున్నాయి. దీనివల్ల ప్రభుత్వఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోంది. దీనికితోడు మద్యం వ్యాపారులుఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యంఅమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ ఎన్‌డీపీకి చెక్‌పెట్టడంతోపాటు ఎంఆర్‌పీ అమలుకుహెచ్‌పీఎఫ్‌ఎస్‌కు శ్రీకారం చుట్టినట్లుతెలుస్తోంది. రెండు నెలల్లో జిల్లా అంతటా అమలుజిల్లాలో రాబోయే రెండు మాసాల్లోపూర్తిస్థాయిలో హెచ్‌పీఎఫ్‌ఎస్ అమలుకు ఎక్సైజ్‌శాఖ చర్యలు చేపడుతోంది.ఇందుకోసం ఇటీవలే జిల్లాలోని మద్యంవ్యాపారులతో అవగాహన సదస్సులునిర్వహించింది. ఈ అవగాహన సదస్సులలో హెచ్‌పీఎఫ్‌ఎస్ నిర్వహణకు అవసరమయ్యే కంప్యూటర్, స్కానర్,ప్రింటర్లు తదితర పరికరాలు అందజేసేమూడు సంస్థలు పరికరాల పనితీరునుపవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారావివరించారు. హెచ్‌పీఎఫ్‌ఎస్ కోసంమద్యం వ్యాపారులు తమ దుకాణాల్లోఒక కంప్యూటర్, బార్‌కోడింగ్ స్కానర్,ప్రింటర్ తపసరిగా ఏరాఠ956?టు చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్‌ను తీవ్రంగావ్యతిరేకిస్తున్నారు. ఇపికే 13 శాతంపన్నులు చెల్లించటంతోపాటు పర్మిట్‌రూమ్ అనుమతులకు అదనపుడబ్బులు చెల్లించామని ఈ తరుణంలోఎక్సైజ్‌శాఖ తమపై మరింత భారంవేయటాన్ని అంగీకరించబోమని కరాఖండిగా చెబుతున్నారు. ఒక్కోమద్యంషాపులో కంప్యూటర్, బార్ కోడ్‌స్కానర్, ప్రింటర్ ఏరాు రూ.40నుంచి 50 వేలు ఖర్చు అవుతుందన్నారు. దీనికితోడు కంప్యూటర్ ఆపరేటర్‌కు కోరిన వేతనం చెల్లించాల్సిఉంటుందని ఈ భారం భరించటం తమవల్ల కాదని మద్యం వ్యాపారులుచేతులు ఎత్తివేస్తున్నారు. దీంతో జిల్లాలోఎక్సైజ్‌శాఖ ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలనుకుంటున్న హెచ్‌పీఎఫ్‌సీవిజయవంతం అవుతుందా లేదాఅన్నది వేచి చూడాల్సిందే.