ఆమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో(టీఏజీసీ), అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) సంయుక్త ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు దసరా ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి 500లకు పైగా తెలుగువారు చికాగోలోని ఆరోర వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మలను ఆకర్షణీయంగా రూపొందించిన వారికి న్యూయార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు స్పాన్సర్ చేసిన బహుమతులను ఆటా వ్యవస్థాపకులు హన్మంత్‌రెడ్డి, మాధవరెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని టీఏజీసీ అధ్యక్షుడు రమేష్ గారపాటి, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం పర్యవేక్షించారు.