విశాఖపట్నం: రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖపట్నంలో డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దాంతో పోలీసులు జ్యోకం చేసుకుని వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దాంతో డీవైఎఫ్ఐ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము అక్కడి నుంచి కదిలేది లేదంటూ డీవైఎఫ్ఐ నాయకులు భీష్మించుకుని కుర్చున్నారు. దాంతో పోలీసులు చేసేది లేక ... మంత్రి గంటా శ్రీనివాసరావు పీఏను పోలీసులు పిలిపించారు. దాంతో రహదారిపైనే డీవైఎఫ్ఐ, గంటా పీఏతో చర్చలు జరుపుతున్నారు.