నూనెపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా ఎంసెట్ రెండో రోజు కౌన్సెలింగ్ కూడా నిలిచిపోయింది. మొదటి రోజు కౌన్సెలింగ్ కేంద్రానికి పడిన తాళం రెండోరోజు కూడా తెరుచుకోలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని, సమైక్యాంధ్ర ఉద్యమకారులకు తాము కూడా మద్దతు ఇస్తున్నామని నంద్యాల ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కారణంగా కౌన్సెలింగ్ విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు విధులను బహిష్కరించి రెండో రోజు కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా ఆందోళనకు దిగారు.
ప్రిన్సిపాల్ రామసబ్బారెడ్డి, అధ్యాపకులు సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రమణమూర్తి, ఉమామహేశ్వరప్ప, మంజునాథ్, సురేష్‌బాబు, రామసుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, మురళీకృష్ణ, వీరభద్రారెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది మొత్తం ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు మణిశేఖర్‌రెడ్డి, జలాలుద్దీన్ ఖాద్రీ, బోయ శ్రీనివాసులు, సాయిబాబా తదితరులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు వ చ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులతో టూటౌన్ సీఐ రామాంజి నాయక్ చర్చలు జరిపారు. శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని కోరారు. అయితే కౌన్సెలింగ్ సాగకపోవడంతో ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్రం వద్ద కాసేపు ఎదురుచూసి ఇంటిముఖం పట్టారు
సాగని కౌన్సెలింగ్
Published Wed, Aug 21 2013 1:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement