ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడిగా నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
జూలై 21 నుంచి కౌన్సెలింగ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడిగా నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 1,66,112 మంది దరఖాస్తు చేయగా 1,49,005 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,47,188 మంది (98.78%) ఉత్తీర్ణత సాధించారు. ఏయూ పరిధిలో 32,418 మంది దరఖాస్తు చేయగా 28,319 మంది పరీక్షకు హాజరై 28,048 మంది (99.04%) అర్హత సాధించారు. ఉస్మానియా పరిధిలో 1,09,282 మంది దరఖాస్తు చేయగా 98,745 మంది పరీక్షకు హాజరై 97,477 మంది (98.72%), ఎస్‌వీయూ పరిధిలో 21,767 మంది దరఖాస్తు చేయగా 19,711 మంది పరీక్షకు హాజరై 19,462 మంది (98.74%) ఉత్తీర్ణత సాధించారు. బాపట్ల కేంద్రం నుంచి నూరుశాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జూలై 21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ర్యాంకుల వివరాలు: గణితంలో హైదరాబాద్‌కు చెందిన ఎం.నాగరాజు, భౌతిక శాస్త్రంలో నల్లగొండకు చెందిన జి.జనార్దన్, బయలాజికల్ సెన్సైస్‌లో కడపకు చెందిన షేక్ నూర్ మహ్మద్, సోషల్ సెన్సైస్‌లో కర్నూలుకు చెందిన ఎన్.నందీశ్వరకుమార్, ఇంగ్లిష్‌లో రంగారెడ్డికి చెందిన సి.శామ్యూల్ ఫస్ట్‌ర్యాంక్ సాధించారు.
యూజీసీ నెట్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 29న జరగనున్న యూజీసీ నెట్ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు రీజియన్ కోఆర్డినేటర్ ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు www.apset.org వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
9 నుంచి దూరవిద్య పీజీ పరీక్షలు: ఓయూ దూరవిద్య పీజీ కోర్సుల మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు జూలై 9 నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఓయూ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.