పెంచిన ప్రేమ.. | edupugallu villagers tribute to pet dog | Sakshi
Sakshi News home page

పెంచిన ప్రేమ..

Published Tue, Jan 14 2014 9:47 AM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM

పెంచిన ప్రేమ.. - Sakshi

పెంచిన ప్రేమ..

కంకిపాడు: మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. అలాంటిది పెంపుకుక్క చనిపోయిందని ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన దేవినేని అనిల్‌కుమార్ కుటుంబసభ్యులు కిక్ పేరుతో పిలుచుకునే కుక్క (నాలుగేళ్లు)ను ఎంతో ప్రేమతో పెంచారు.

అది అనారోగ్యంతో నాలుగు రోజుల కిందట మృతిచెందింది. దాన్ని ఖననం చేసిన ఆ కుటుంబసభ్యులు సోమవారం ఐదోరోజు కర్మకాండలు నిర్వహించారు. అన్నదానం చేశారు. ‘భగవంతుని సన్నిధిలో..’ అంటూ కిక్ నేస్తమైన మరో శునకం స్నూఫీ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నట్లు బ్యానర్లు ఏర్పాటుచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement