నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
Published Fri, Feb 14 2014 2:42 AM | Last Updated on Wed, Sep 5 2018 3:59 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లా విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. వేతన సవరణ చేయాలని కోరుతూ రెండు రోజులనుంచి ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరిం చారు. ప్రకటించినట్లుగా విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా ఉండదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement